Home  »  TV News  »  Karthika Deepam2 : జ్యోత్స్నకు సూరజ్ వార్నింగ్.. అసలు ఆ రాక్షసుడు ఎవరు?

Updated : Jun 9, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -691 లో..... ధీరజ్ గురించి జ్యోత్స్న ఆలోచిస్తుంది. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ కూర్చోమని పారిజాతం వెటకారంగా అంటుంది. అప్పుడే సూరజ్ ఫోన్ చేసి.. నన్ను గుర్తు చేసుకుంటున్నావ్ కదా అని అడుగుతాడు. దాంతో జ్యోత్స్నకి కోపం వస్తుంది. ఎవడ్రా నువ్వు.. అసలు నేను తిడుతుంటే నీకు కోపం రాదా అని జ్యోత్స్న అనగానే నాకు కోపం అయినా.. ఏదైనా.. రావాలని అనుకున్నప్పుడే వస్తుంది. ఒకరు చెప్పినప్పుడు నాకు రాదు అని సూరజ్ అంటాడు. దాంతో జ్యోత్స్నకి ఇంకా కోపం వస్తుంది.

అసలు ఎవడ్రా నువ్వు అని జ్యోత్స్న అనగానే వీడియో కాల్ చెయ్యాలా చూస్తావా అని సూరజ్ అంటాడు. ఈ ఒక్క రాత్రి బాగా నిద్రపో.. రేపటి నుంచి అసలు నిద్ర పట్టదని సూరజ్ ఫోన్ కట్ చేస్తాడు. వాడు ఎవడో నీకంటే కంత్రిగాడిలాగా ఉన్నాడని పారిజాతం అంటుంది. మరుసటి రోజు శౌర్య ఆడుకుంటూ శివన్నారాయణ గదిలో దాక్కుంటుంది. తన కోసం దీప వెతుకుతుంది. శౌర్య అలమరాలో దాక్కుంటుంది. అందులో నుంచి బయటకు వస్తుంటే కొన్ని బుక్స్ పడిపోతాయ్.. అందులో శివన్నారాయణ, దక్షిణామూర్తి కలిసి ఉన్న ఫోటో.. రెండు వక్కలుగా ఉంటుంది. ఆ ఫోటో కింద పడిపోతుంది. అది చూసి ఇదేంటీ ఇలా అయిపోయిందని అది పట్టుకొని హాల్లోకి వెళ్లి జ్యోత్స్నని అడుగుతుంది. మా అమ్మని అడుగమని శౌర్యతో జ్యోత్స్న అనగానే అక్కడున్న సుమిత్రకి ఆ ఫోటో చూపిస్తుంది. దాంతో తను షాక్ అవుతుంది. ఆ ఫోటో ఎందుకు అమ్మమ్మ ఇలా ఉందని శౌర్య అడుగుతుంది. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. ఎవరు ముద్దుల తాత ఈ ఫోటోలో ఉంది.. ఎందుకు ఇలా చింపారని శౌర్య అంటుంది. కాంచన వెంటనే శౌర్యని పిలుస్తుంది. నీకు తర్వాత చెప్తాను.. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళమని పంపిస్తుంది. సారీ నాన్న అని కాంచన అనగానే గతం గురించి ఒక్క శౌర్యకే కాదు అందరికి తెలియాలి.. తెలిస్తేనే ఇక అతని టాపిక్ ఇంట్లో తియ్యరని శివన్నారాయణ అంటాడు. అక్కడే కార్తీక్, దీప అందరు ఉంటారు. అతను నా ప్రాణస్నేహితుడు. మేం ఎలా సన్నిహితంగా ఉన్నామో.. మా పిల్లలు కూడా అలాగే ఉన్నారు. తండ్రి ఒప్పుకుంటాడని సుమిత్ర నా కొడుకు దశరథ్ ని పెళ్లి చేసుకుంది. అప్పుడు నా కొడుకు అతని కంపెనీలో మేనేజర్ గా చేసేవాడు.. నా కూతురికి భర్తగా సరిపోడని.. నా కొడుకుని గన్ తో కాల్చగా.. సుమిత్ర అడ్డు పడడంతో గోడకి తాకింది.

ఆ తర్వాత సుమిత్ర గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ చూడడానికి వస్తే తనని కూడా చంపేసాడు. అలాంటి రాక్షసుడు వాడు అని శివన్నారాయణ చెప్తాడు. నేను చెప్పింది తప్పా అని సుమిత్రని అడుగగా లేదు మావయ్య నిజమే చెప్పారని సుమిత్ర అంటుంది. ఇక మీదుట అలాంటి వాడి గురించి మాట్లాడవద్దని శివన్నారాయణ చెప్పి ఆఫీస్ కి వెళ్తాడు. ఆ తర్వాత కార్తీక్, దీప, జ్యోత్స్న వెళ్లేసరికి సూరజ్ వర్క్ చేస్తుంటాడు. కార్తీక్ బయటకు వెళ్తాడు. దీప కూడా వెనకాలే వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.